
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బిసి జనగణన బిసి కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది అని కమలా పూర్ మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు కొండా రమేష్ అన్నారు.శనివారం మండల కేంద్రములో విలేకరుల సమావేశములో మాట్లాడుతూ వెనకబడిన కులాల అభివృద్ధి లక్ష్యం తో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లు ను శాసనసభ లో ప్రవేశ పెట్టడం జరిగిందని,జనాభా ప్రాతిపదికన విద్య,ఉద్యోగ,ఉపాధి రంగాల్లో వెనుకబడిన వర్గాలకు ఎంత గాను ఉపయోగపడతాయి అన్నారు.ముఖ్య మంత్రి,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశములో,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేశిని ఐలయ్య, హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పొడేటి భిక్షపతి,హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ విష్ణు దాసు వంశీధర్ రావు, సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ ఆన్ కార్ అశోక్,అక్కినపల్లి భిక్షపతి,పోతిరెడ్డి ఓదేలు,కిన్నెర కృష్ణ మూర్తి,దేశిని వీరయ్య, నాయకురాలు ఆడేపు విజయ,రజిత తదితరులు పాల్గొన్నారు.