కాజీపేట, నేటిధాత్రి:
తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం సమావేశం కాజీపేట రహెమత్ నగర్ లో ఉమ్మడి జిల్లా ఇంచార్జి బర్కం రామ్మోహన్ అధ్యక్షతన జరిగినది. ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ గారు విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో బీసీ లు అభివృద్ది చెందుటలో భాగంగా ముఖ్యంగా చట్ట సభలలో బీసీ లకు సీట్లు కేటాయించడంలో భారత రాష్ట్ర సమితి నుంచి వరంగల్ పశ్చిమ నియోజకర్గం టికెట్ పొంది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో ప్రజలతో సంబంధాలు కలిగిన వ్యక్తి అన్ని వర్గాలతో అనునిత్యం వారి సమస్యల సాధన కోసం కృషి చేస్తూ ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ గారి గెలుపే లక్ష్యంగా బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కావచ్చు. కాంగ్రెసు పార్టీ కావచ్చు. వరంగల్ పశ్చిమలో బీసీ లకు టికెట్ ఇవ్వలేదని బిసి కి టికెట్ ఇచ్చిన పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో చట్టసభలలోకి పంపించాల్సిన భాధ్యత మనపై ఉన్నదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో దామెరుప్పుల జనార్దన్,దొడ్డిపాటి శేఖర్ రజక . పొన్నం వెంకటేశ్వర్లు గౌడ్, వెలకంటి రాజనంద, అబ్బోజు శంకరమూర్తి, గుంటి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.