Kakatiya University BC Teachers Support BC Bandh
బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగబోయే 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయ బీసీ టీచర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బీసీ టీచర్స్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగయ్య జనరల్ సెక్రెటరీ డాక్టర్ రమేష్, కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ శేషు,డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ రాధిక, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మల్లేష్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్, డాక్టర్ విజయ్ పాల్గొన్నారు.
