BC Leaders Urged to Make Aakrosha Sabha a Success
బీసీ ఆక్రోష సభను విజయవంతం చేయాలి
ఎస్సీ,ఎస్టీ జేఏసీ మండల కో ఆర్డినేటర్ చుక్క రత్నాకర్
పరకాల,నేటిధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు అమలులో వైఫల్యం చెందిందని బీసీ ఎస్సీ,ఎస్టీ జేఏసీ పరకాల మండల కో ఆర్డినేటర్ చుక్క రత్నాకర్ అన్నారు.సోమవారం నాడు స్థానిక అమరదామంలో మండల అధ్యక్షులు బొచ్చు నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హాజరై ఆక్రోషసభ కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చుక్క రత్నాకర్ మాట్లాడుతూ బీసీ 42శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో పెట్టకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తుందని,బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడకపోవడం ఏమిటని,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల రిజర్వేషన్ల పట్ల నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డికరేషన్లో బీసీ బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి,ఇంతవరకు బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మోసం చేసిందన్నారు.బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ మూడు పార్టీలు బీసీల రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం లేకుండా కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు.జస్టిస్ ఈశ్వరయ్య,రిటైడ్ ఐఏఎస్ చిరంజీవులు,డా.విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో జరుగబోయే
కామారెడ్డి ఆక్రోశసభకు మండలం వ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొచ్చు హరీష్,కృష్ణ మహారాజ్, తిరుపతి,దిలీప్,బాలు, తదితరులు పాల్గొన్నారు.
