
NHRC State EC Members Appointed
ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర కమిటీ ఈసీ సభ్యులుగా బత్తుల రాజశేఖర్, డ్యాగతి హరీష్
నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య
“నేటిధాత్రి”,
యూసఫ్ గూడా (హైదరాబాద్): జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర కమిటీ ఈసి సభ్యులుగా కరీంనగర్ జిల్లాకు చెందిన బత్తుల రాజశేఖర్, డ్యాగతి హరీష్ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో వారికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య నియామక పత్రాలు అందించారు. పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకపోవడంలో వారు చేస్తున్న కృషిని అభినందించారు. నేషనల్, రాష్ట్ర కమిటీల ఆదేశాల మేరకు పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్యకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాముకు మరియు రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఇంజన్ సాంబశివరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు విలాసాగరం పృథ్వీరాజ్, వరంగల్ సోషల్ మీడియా కన్వీనర్ ఆవునూరు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.