మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దసరా పండగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండగలను తలపించేలా ఆడపడుచులకు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మాజీ మంత్రి,ఎమ్మెల్యే డా”సి. లక్ష్మారెడ్డి ఆదేశాలనుసారం శుక్రవారం రోజు జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ఉమ్మడి దొండ్లపల్లి సెగ్మెంట్ బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి ఆధ్వర్యంలో కుత్నేపల్లి-బోడగుట్ట గ్రామ పంచాయతీ లో, చోక్కంపెట్ గ్రామ పంచాయతీ లో, దొండ్లపల్లి గ్రామ పంచాయతీలో, రాఘవపూర్ గ్రామ పంచాయతీ లో, కొర్రతండా గ్రామ పంచాయతీలాల్లో ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ మరియుగ్రామాలలో క్రీడా కారులకు స్పోర్ట్స్ కిట్స్, స్పోర్ట్స్ డ్రెస్ లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కుత్నేపల్లి సర్పంచ్ సేవ్యనాయక్, చోక్కంపెట్ సర్పంచ్ కృష్ణయ్య, రాఘవపూర్ సర్పంచ్ శ్రీనివాస్, కొర్రతండా సర్పంచ్ హాన్యా నాయక్, దొండ్లపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి రంజిత్ గౌడ్, ఉప సర్పంచ్లు రాజు నాయక్, బోయనిలమ్మ, యాదమ్మ, ప్రియాంక చిరంజీవి, వార్డు మెంబెర్స్, గ్రామ కో ఆప్షన్స్ మెంబెర్స్, బి, ఆర్, ఎస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.