ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆడపడుచు కట్నం బతుకమ్మ చీర

*ఎంపీపీ స్వరూప రాణి

రుద్రంగి, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ
సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలు
కానుకగా ఇస్తున్నారని రుద్రంగి మండల ఎంపిపి గంగం స్వరూప రాణి అన్నారు. శుక్రవారం రోజున
రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూప రాణి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మహిళలకు
బతుకమ్మ చీరలను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధులకు, పెండ్లి చేసి కష్టాల్లో
ఉన్న పేదింటి తల్లులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు పెద్ద దిక్కై ఇంట్లో పెద్ద కొడుకులా
ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలు ఇచ్చి
ఆదుకుంటున్నరన్నారు. వికలాంగులకు తోడుగా
నెలకు రూ. నాలుగు వేలు ఫించన్ ఇవ్వడం
జరుగుతుందన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉ
ందన్నారు. కన్న కొడుకులా కేసీఆర్ బతుకమ్మ చీర
ఇస్తున్నారని తెలిపారు. ప్రకృతిని పూజించే పండుగ
బతుకమ్మ పండుగ అని వ్యాఖ్యానించారు.
ప్రకృతి పండుగను తెలంగాణ ఆడబిడ్డలు
సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఉ
చితంగా బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ
చేస్తుందన్నారు. ప్రజలందరూ పండుగలను
గొప్పగా, సంతోషంగా జరుపుకోవాలనేదే ప్రభు
త్వ ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర
ంలో ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం
అందుతుందని అన్నారు. జిల్లా ప్రజలంతా బతు
కమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని
కోరారు. ఇంత మంచి పనులు చే స్తున్న సీఎం
కెసిఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని
ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్య క్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం, ఎంపీడీవో శంకర్, నాయకులు కొమరే శంకర్, గంగo మహేష్ ,పూదరి మహిపాల్ , మేక రాజేందర్ , రవి, కో ఆప్షన్ మేంబర్ జమిల బేగం మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *