బతుకమ్మ విశిష్టతను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచం నలుదిశలా చాటి చెప్పారు: ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర
ముఖ్యమైన పండుగల సందర్భంగా మహిళలకు పెద్ద ఎత్తున చీరలను బహుకరిస్తున్నం:ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్షా 116 రూపాయలు సాయం చేస్తున్నం:ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర
కేసీఆర్ సుపరిపాలనలో మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నరు:ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర
ఖమ్మం:ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.
మహిళల భద్రత, సంక్షేమం,ఉన్నతికి పలు పథకాలు రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు.బతుకమ్మ పండుగ సందర్భంగా ఖమ్మం నగరంలోని 10వ డివిజన్, జిల్లాలోని రఘునాథపాలెంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో టిఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావులతో కలిసి రవిచంద్ర మహిళలకు చీరలు బహుకరించారు.బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భాలలో కేసీఆర్ పేద వర్గాల వారికి దుస్తులు,చీరలను బహుకరిస్తున్నారని తెలిపారు.తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నేతన్నలకు చేతినిండా పని కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం కూడా ఈ చీరల పంపిణీ పథకంలో ఒక భాగమన్నారు.ఈ ఏడాది ఇందుకోసం 350 కోట్లు ఖర్చు చేసినట్లు,ఈ బతుకమ్మతో కలిపి సుమారు 5కోట్ల 90లక్షల చీరలు అందించినట్టవుతుందని వద్దిరాజు వివరించారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్..బతుకమ్మ పండుగను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతూ,దీని విశిష్టతను,మన సంస్కృతి,సంప్రదాయాలను ప్రపంచం నలుదిశలా చాటి చెబుతున్నారన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఒక్కొక్కరికి లక్షా 116 రూపాయలు సాయమందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.దీంతో,బాల్య వివాహాలు పూర్తిగా తగ్గడమే కాక,మహిళల కోసం పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన గురుకులాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారని రవిచంద్ర చెప్పారు.మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేయడంతో నేరాలు, ఘోరాలు పూర్తిగా తగ్గిపోయాయని వివరించారు.