నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజున బతుకమ్మ వేడుకలను శ్రీ సాయి ట్రస్ట్ హనుమకొండ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థుల తల్లులు ప్రతి ఒక్కరు బతుకమ్మను తీసుకొచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ సాయి ట్రస్ట్ హనుమకొండ అధ్యక్షురాలు వేముల ప్రభావతి హాజరై మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మని, తెలంగాణ ఆడబిడ్డల పండుగని అన్నారు. బతుకమ్మను రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పూలను పూజించే సంస్కృతి మన తెలంగాణ ఆడబిడ్డలకే ఉన్నదని అన్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అనే పాటలలో మహిళలు తమ కష్టాలు సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధం ఆప్యాయత భక్తి ,భయం, ఉంటుందని అన్నారు. తెలంగాణ అస్తిత్వానికి బతుకమ్మలే అని అన్నారు. బతుకమ్మ వేడకల్లో పాల్గొన్న తల్లులకు శ్రీ సాయి ట్రస్ట్ అధ్యక్షురాలు వేముల ప్రభావతి ప్రధమ, ద్వితీయ తృతీయ బహుమతులకు శ్రీ సాయి ట్రస్టు ద్వారా పట్టు చీరలు అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పోలంపల్లి విజేందర్, నిగ్గుల శ్రీదేవి, పరశువేణి జ్యోతి, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య, తాళ్లపల్లి మంజుల, శీలం సరిత, తల్లులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.