ప్రిన్సిపల్ ఎ.నవీన్ కుమార్
మందమర్రి, నేటిధాత్రి:-
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ ఎ నవీన్ కుమార్ అన్నారు. గురువారం మందమర్రి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు, విద్యార్థినిలు, మహిళా ఉపాధ్యాయురాలు పూలతో బతుకమ్మలను చేసి పిల్లలతో కలిసి కోలాటంతో బతుకమ్మ పాటలపై నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎ నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఇది తెలంగాణలో చారిత్రాత్మకమైన పండుగ కాకతీయ కాలంలో జరిగిన ఒక యదార్ధ గాధ ఆధారంగా ఈ పండుగ ఆచరణలోకి వచ్చిందని అన్నారు. బతుకమ్మను అమ్మవారి స్వరూపంగా కాలానుగుణంగా గుమ్మడి పూలు, తంగేడు పూలు పలు రకాల పూలతో గుండ్రంగా పేర్చి మధ్యలో గౌరీ దేవిని పెట్టి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. తొమ్మిది రోజులపాటు మహిళలు మాత్రమే జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని, తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రతీక అని, మహిళలను ఒక్కచోటకు చేర్చి ఆరోగ్యం, ఆనందాన్ని అందించే పండుగ బతుకమ్మ పండుగని విద్యార్థుల కు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ ఎర్ర సంపత్ కుమార్, సి బ్యాచ్ ఇంచార్జ్ రవి కుమార్, ప్రైమరీ ఇంచార్జి సునీత, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.