జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
కోలు కోలోయన్న కోలో నా సామి…. అంటూ పాటలు పాడుతూ… బతుకమ్మల చుట్టూ తిరుగుతూ.. చప్పట్ల మోతలతో ముందస్తు బతుకమ్మ సంబురాలు ఘనంగా మొదలైనాయి. జమ్మికుంట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్ధినీ, విద్యార్థులు బతుకమ్మ వేడుకలను ఆనందోత్సవాల మధ్య గురువారం జరుపుకున్నారు. శుక్రవారం నుండి పాఠశాలలకు బతుకమ్మ సెలవులు మొదలు కానున్న దృష్ట్యా విద్యార్థులు రకరకాల పూలను సేకరించి ఉపాధ్యాయినీల సూచనలతో విద్యార్థులు అందమైన బతుకమ్మలు తయారు చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి. చప్పట్లు, కోలాటాల మధ్య పాఠశాలలో బతుకమ్మ పండుగను నిర్వహించుకున్నారు. అనంతరం విద్యార్థులు ఇండ్లల్లో తయారు చేసుకోచ్చిన సత్తును (ప్రసాదాన్ని) అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి విద్యార్థులందరికి పంచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి సుధాకర్ ఆధ్వర్యములో జరిగిన ఈ కార్యక్రమములో పాఠశాల ఉపాధ్యాయినీలు భాగ్యలక్ష్మి, రమాకుమారి, రమాదేవి, రేణుక, ఇందిరలు పర్యవేక్షించగా ఉపాధ్యాయులు, విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.