
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్.తెలంగాణలో కన్నుల పండుగగా నిర్వహించుకునే బతుకమ్మ పండగను పురస్కరించుకుని ప్రతియేటా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొత్తగూడెం మునిసిపాలిటీ పరిధిలోని 6 వ వార్డు నందు గౌరవ మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక కార్యక్రమాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వలన పేదింటి మహిళలు పండుగ రోజున కొత్త చీర ధరించుకునే అవకాశాన్ని కల్పించడంతో పాటుగా చేనేత కార్మికులకు చేతి నిండా ఉపాధి కల్పించి కార్మికుల జీవితాలలో కాంతులు నింపుతున్న ముఖ్యమంత్రి కార్యక్రమాలు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాదాపుగా 20 రకాల రంగులతో కూడిన బతుకమ్మ చీరలు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం వలన పేదింటి ఆడపడుచులు ఎంతో సంతోషంతో బతుకమ్మ సంబరాలు చేసుకుంటారని వారు అన్నారు. కొత్తగూడెం మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 25000 చీరలు వచ్చాయని వాటిని రేషన్ షాపుల వారిగా ఆహార భద్రత కార్డులలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులను లబ్దిదారులుగా గుర్తించి ప్రతి ఒక్కరికి పంపిణీ నిర్వహించే విధంగా 36 వార్డులో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి పంపిణీ చేయడంతో పాటుగా, వచ్చేటటువంటి లబ్ధిదారులకు ఎటువంటి అటంకాలు కలగకుండా తగు ఏర్పాట్లను మునిసిపాలిటీ నుండి చేయడం జరిగిందని వారు అన్నారు. ఎన్నో రకాల సంక్షేమ పథకాలు, మరియు చక్కటి కార్యక్రమాలతో తెలంగాణ అభివృద్దే ద్వేయంగా కఠోర దీక్షతో బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా. ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి మరొక్కసారి కూడా గులాబీ జెండా రాష్ట్రంలో మరియు కొత్తగూడెం నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తే రాష్ర్టం మరింత అభివృద్ధికి నోచుకుంటుందని వారు అన్నారు. చీరల పంపిణీ కార్యకమానికి లబ్దిదారులుగా విచ్చేసిన ఆడపడుచులు అందరూ బతుకమ్మ చీరలు ధరించి ముఖ్యమంత్రి కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు చైర్ పర్సన్ సీతాలక్ష్మీ వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆకర్షణగా నిలిచారు.