హన్మకొండ, నేటిధాత్రి, (న్యాయ విభాగం):-
హన్మకొండ జిల్లా కోర్టులో బతుకమ్మ సంబరాలు గురువారం ఘనంగా జరిగాయి. 10 కోర్టు బిల్డింగ్ లోని మహిళా న్యాయవాదుల హాల్లో మహిళా న్యాయవాద జాయింట్ సెక్రెటరీ స్వప్న, ఈసి మెంబెర్స్ అనిత, రమాదేవి ఆధ్వర్యంలో బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పేర్చి తమ ఆరాధ్య ధైవం అయిన బతుకమ్మ ను భక్తి శ్రద్ధలతో పూజించారు. అనంతరం బతుకమ్మను కోర్టు ఆవరణలోకి తీసుక వచ్చి న్యాయవాదులు తమ ఆటా, పాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి హన్మకొండ ప్రిన్సిపాల్ సీనియర్ న్యాయమూర్తి క్షామా దేశ్ పాండే గారు ముఖ్య అతిగా పాల్గొనగా, వరంగల్ మేయర్ జి..సుధారాణి గారు పాల్గొని మహిళా న్యాయవాదులతో బతుకమ్మను ఆడారు ఇట్టి కార్యక్రమానికి హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాతంగి రమేష్ బాబు వైస్ ప్రెసిడెంట్ పోషిని రవీందర్,మరియు ఎల్.రమేష్, విజేందర్, సంపత్, చిరంజీవి, సదానందం, అచ్యుత్, రుత్విక్, సురేంద్రరెడ్డి, శ్రీనివాస్, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి .జీవన్ గౌడ్, ముదాసిర్ అహ్మద్, రమణ, సాంబశివరాజు, శంకరాచారి, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ బి.జయాకర్, హనుమకొండ జి . పి కె.నరసింహారావు మరియు సీనియర్ న్యాయవాదులు విద్యాసాగర్ రెడ్డి, కె.రమేష్, నారాయణ, సి చ్ రమేష్, ఐజ్జిగిరి సురేష్, బోనాల అనిల్ మరియు మహిళా న్యాయవాదులు అండాలు, శ్రీలత, రమాదేవి, విజయ దేవి, రజినీ, మాలతి, సునీత, వెంకట పద్మావతి, శేషిరేక మరియు ఇతర మహిళా న్యాయవాదులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం మహిళా న్యాయవాదులకు హనుమకొండ బార్ అసోసియేషన్ తరుపున బహుమతులను ప్రదానం చేశారు.