పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి పట్టణ కేంద్రం, దర్దేపల్లి, మల్లంపల్లి గ్రామ ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఎత్తిన వారితో పాటు ఆడి పాడిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు. వారు మాట్లాడుతూ మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ పూలతో ”దేవుళ్ళను” పూజిస్తారు. పూలనే దేవుళ్ళుగా పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణా గొప్పదనం. ఆడభిడ్డల కనులపండుగ తెలంగాణా సంస్కృతి చిహ్నం మన పండగ. ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.