
Bathukamma Celebrations in Housing Board Colony
హౌసింగ్ బోర్డ్ కాలనీలో బతుకమ్మ సంబరాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో యూవసేన మట్టి గణేష్ ఉత్సవాకమిటి ఆధ్వర్యంలో అక్టోబర్ 01న బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మ పేర్చి, ఆటపాటలతో పండుగను జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం కట్టే విధంగా ఈ పండుగను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని, మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించాలని, దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని మహిళలు తెలిపారు.