
Batukamma Celebrations at Hanamkonda Court
హన్మకొండ జిల్లా కోర్టులో ఘనంగా బతుకమ్మ సంబరాలు:-
ముఖ్య అతిథిలు గా హాజరైన ఇరు జిల్లా ప్రధాన న్యాయమూర్తులు:-
హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి, (న్యాయ విభాగం):-
హన్మకొండ జిల్లా కోర్టులో బతుకమ్మ సంబరాలు గురువారం నాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మహిళా న్యాయవాద జాయింట్ సెక్రెటరీ ఆర్.నాగేంద్ర, ఈసి మెంబెర్స్ ఎస్.ఇందిరా వేద కుమారి, కె.స్వాతి ఆధ్వర్యంలో బతుకమ్మను మహిళా న్యాయవాద హాల్లో పేర్చి, బతుకమ్మను టెన్ కోర్టు భవనం ఆవరణలో పెట్టీ పూజలు చేసి అనంతరం న్యాయవాదులు తమ ఆటా, పాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా .కె.పట్టాభి రామరావు మరియు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి వి. బి నిర్మలా గీతాంబ బతుకమ్మ సంబరాలను ప్రారంబించారు. వరంగల్ జిల్లా జడ్జి మహిళా న్యాయవాదులతో కలిసి బతుకమ్మను ఆడారు. ఇట్టి కార్యక్రమానికి హన్మకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పులి సత్యనారాయణ, జనరల్ సెక్రెటరీ కె.రవి, ఇతర కమిటీ సభ్యులు మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు మహిళా న్యాయవాదులు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు, అనంతరం హన్మకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమానికి హాజరై బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు.