చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లోని సువిద్య డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలని* ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయముగా బతుకమ్మల్ని పేర్చి ఆడుకున్నారు. తెలంగాణ ప్రతీక అయినా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరము విద్యార్థులు నృత్యలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కందికొండ రాజు, కళాశాల ఇంచార్జి నోముల వేణు, అధ్యాపకులు దూడపాక సంతోష్, నోముల ప్రీతం, లోకేందర్ రెడ్డి, సాంబయ్య, రంజిత్,ఝాన్సీ, శ్రీవిద్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.