మందమర్రి, నేటిధాత్రి:-
మందమర్రి పట్టణంలోని మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థిని, విద్యార్థులు. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందస్తు బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఎన్జిఓ భువనేశ్వరి మాట్లాడుతూ, విద్యార్థినీ, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తూ, విద్యాబుద్ధులతో ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రార్థిస్తూ, బతుకమ్మ సంబరాలు ఆనంద ఉత్సాహాలతో పాఠశాల ఆవరణలో జరుపుకోవడం జరిగిందని అన్నారు. మన పూర్విక సాంప్రదాయాలను ఇలాగే కొనసాగించాలని తెలిపారు.