చందుర్తి, నేటిదాత్రి:
చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామంలో మహోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ మాట్లాడుతూ… మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు, బతుకమ్మకు వాడే వివిధ రకాలైన పువ్వుల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు బతుకమ్మ చుట్టూ ఆడుతూ, పాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏనుగుల రేణుక, కముటం స్వప్న, మెంగళి కవిత, బీరెల్లి రస్మిత, కర్ల భవాని, విద్యార్థులు పాల్గొన్నారు.