వేడుకల్లో పాల్గొన్న కరస్పాండెంట్ మురళీధర్.
#నెక్కొండ, నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని గౌతమి విద్యానికేతన్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మలు పేర్చి తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ పండగ విశిష్టతను తెలంగాణ సంస్కృతిని విద్యార్థులకు తెలియజేసేలా ఉపాధ్యాయులు సాంప్రదాయ పద్ధతులను నేర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కల్పన, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.