
Baswaraju appointed as Zaheerabad Mandal Education Officer
జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజు నియామకం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజును నియమిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎంఈఓగా పనిచేసిన బస్వరాజు పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో మండలంలోని సత్వార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పని చేస్తున్న బస్వరాజును ఎంఈఓగా నియమించినట్లు పేర్కొన్నారు.