Velichala Launches Basti Bata in Karimnagar
29వ డివిజన్లో బస్తీ బాట, డివిజన్ కార్యాలయం ప్రారంభించిన వెలిచాల
కరీంనగర్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలకు తప్పకుండా నామినేటెడ్ పదవులు దక్కుతాయని వారి శ్రమ కష్టం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడ్డ వారందరికీ తగిన న్యాయం చేస్తుందని అందుకు తాను ముందుండి అన్ని విధాలా సహకరిస్తానని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవులు దక్కేలా ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. ఆదివారం సాయంత్రం 29వ డివిజన్ కిసాన్ నగర్ లో కాంగ్రెస్ నాయకులు తాండ్ర శంకర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాన్ని రాజేందర్ రావు ప్రారంభించారు. అనంతరం బస్తిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు డివిజన్ కాంగ్రెస్ నాయకులు మహిళలు ప్రజలు రాజేందర్రావుకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. 29వ డివిజన్ కిసాన్ నగర్ లో రాజేందర్రావు ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ సర్వే ఆధారంగా అధిష్టానం టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకొని టికెట్లను అందిస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు నిరంతరం శ్రమించిన జీడి రమేష్ కల్వల రామచందర్ మహేష్ లాంటి సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవులు దక్కేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తాను ప్రమాణం చేసి ఈవిషయాన్ని మనస్ఫూర్తిగా చెబుతున్నానని తెలిపారు. అనేక ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్నారని వారి కష్టానికి ఫలితం కొద్ది రోజుల్లో దక్కనుందని ఉందని రాజేందర్రావు పేర్కొన్నారు. కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వారిని ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలా బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరు కూడా నిరుత్సాహపడవద్దని కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ముందుండి కృషి చేయాలని కోరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. బస్తి బాట కార్యక్రమానికి డివిజన్ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాండ్ర శంకర్ బాబు, గసికంటి కుమారు జీడి రమేష్ గండి రాజేశ్వర్ గండి శ్యామ్ గండి గణేష్ కాసారపు కిరణ్ కుమార్, గోశిక శంకర్ సముద్రాల అజయ్ వడ్లూరి శ్రీనివాస్ వివిధ కుల సంఘాల నాయకులు, ఇతర నాయకులు, మహిళలు డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
