
Basaveshwara
18న బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ.
◆- కరపత్రం విడుదల చేసిన పీఠాధిపతులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జగద్గురు మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ ఈనెల 18న నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. సంబంధిత కరపత్రాన్ని, గోడపత్రికను శుక్రవారం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో పీఠాధిపతులు మహామండలేశ్వర్ శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ విడుదల చేశారు. వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో హాజరై బసవేశ్వర విగ్రహావిష్కరణను విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.