
DCMS Chairman Shivakumar.
బసవేశ్వరుడు ఆదర్శనీయుడు..!
◆ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: జగద్గురు మహాత్మా బసవేశ్వరుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. ఆదివా రం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన బసవేశ్వర స్వామి విగ్రహాన్ని బర్దిపూర్, మల్లన్న గట్టు, ధనశ్రీ పీఠాధిపతులు సిద్దేశ్వర స్వామి, బసవలింగ, వీరేశ్వర శివాచార్య లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడు అన్ని వర్గాల ప్రజలను భక్తి మార్గం వైపు మళ్లించేందుకు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్ర మంలో ఉత్సవ కమిటీ నాయకులు పరమేశ్వర్ పాటిల్, సంగమేశ్వర్, వినీల నరేష్, చంద్రయ్యతో పాటు వివిధ గ్రామా భక్తులు పాల్గొన్నారు.