మాదిగలు రాజకీయంగా,సామాజికంగా అభివృద్ది చెందడమే లక్ష్యం!!!
ఎండపల్లి నేటి ధాత్రి
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండల మాదిగ మహాదండు సంక్షేమ సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం కిషన్ రావుపేట నాగపల్లి లక్ష్మి నర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం వెల్గటూర్ మండల అధ్యక్షుడిగా మండలంలోని పైడిపల్లి గ్రామానికి చెందిన బరిగెల సురేష్ ను నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుశనపల్లి దుర్గయ్య నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా బరిగెలసురేష్ మాట్లాడుతూ తన నియమాకానికి సహకరించిన మాదిగ కుల బాంధవులందరికీ, జాతీయ నాయకులు బొల్లి స్వామి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మండలంలోని మాదిగ కులస్తులందరినీ ఐక్యపరుస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, మాదిగ కులస్తులను సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందే విధంగా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి మండల అధ్యక్షుడు చొప్పదండి రాములు, నాయకులు కల్లెపెల్లి మల్లయ్య, లింగయ్య, ఎల్తూరి మల్లేష్, వేముర్ల రాజ్ కుమార్,అశోక్, గజ్జల రాజు, చొప్పదండి వంశీ, కుంటాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.