
Sai Drishti Blind School
సేవ స్ఫూర్తితో క్షురకులు
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
శ్రీరాంపూర్ ప్రాంతంలోని సాయి దృష్టి అంధుల పాఠశాల,వృద్ధాశ్రమంలోని 9 మంది వృద్ధులకు సేవ స్ఫూర్తితో జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల చంద్రయ్య, మండల నాయి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు కళ్యాణం లక్ష్మణ్ బుధవారం కటింగ్,గడ్డం చేశారు.ఈ కార్యక్రమం అనంతరం వారికి పండ్లను అందజేసి మానవత్వం చాటుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నిత్యం వృత్తిరీత్యా అనేక మందికి క్షవరాలు చేస్తామని,కానీ ఈరోజు మేము చేసిన ఈ సేవ ఎంతో తృప్తినిచ్చిందని అన్నారు.ఈ బిజీ జీవితాలలో ఇతరులు కూడా వారికి తోచిన సహాయ,సహకారాలను సేవ దృక్పథం తో మనకంటే తక్కువ ఉన్న వారికి అందించాలని కోరారు.