సేవే లక్ష్యంగా క్షురకులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రస్తుత జీవన విధానంలో ఒకరినొకరు పట్టించుకునే పరిస్థితులు లేవు.అలాంటి రోజులలో శ్రీరాంపూర్ ప్రాంతంలోని క్షురకులు సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.మంగళవారం నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ప్రాంతంలోని సాయి దృష్టి అందుల పాఠశాల, వృద్ధాశ్రమంలోని 9 మంది వృద్ధులకు సేవాస్పూర్తితో నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల చంద్రయ్య,మండల ఉపాధ్యక్షులు కళ్యాణం లక్ష్మణ్,వర్కింగ్ ప్రెసిడెంట్ కురిమిళ్ళ మోహన్ కటింగ్, గడ్డాలు చేశారు.అనంతరం కీర్తిశేషులు కళ్యాణం ఏనమ్మ, వెంకటి జ్ఞాపకార్థం వారి కుమారుడు కళ్యాణం లక్ష్మణ్, పద్మ ఆశ్రమంలోని వృద్ధులకు కొత్త వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వృత్తిరీత్యా అనేకమందికి కటింగ్,గడ్డాలు చేస్తూ ఉంటామని,కానీ ఇలాంటి వారికి చేసిన సేవ ఎంతో తృప్తినిస్తుందని అన్నారు.అలాగే మనకు తోచిన సహాయం,మనకంటే కింది స్థాయిలో ఉన్నవారికి అందించాలని కోరారు.
