ఫిర్యాదు చేసిన పట్టింంచుకోని ఆర్డిఓ
-ఆక్రమణకు యత్నాలు
-ఆదుకోవాలని కలెక్టర్ కు మొరపెట్టుకున్న దళిత రైతులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 26
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని నర్సింగాపురం గ్రామానికి చెందిన దళిత రైతుల భూముల్లోంచి బండ్లబాట వేసే కుటీీల యత్నాలు కొనసాగుతున్నాయని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సింగాపురం శివారు చెరువు కట్ట కింద దళితులకు సంబంధించిన వ్యవసాయ పట్టా భూముల్లోంచి వేరే గ్రామానికి చెందిన అగ్ర కులస్తుడు గతంలో అక్రమంగా బాట వేసినందుకు అతనిపై కేసు పెట్టామని, తదుపరి ప్రజాదర్బార్ లో ఫిర్యాదు చేయగా..విచారణకు వచ్చిన ఆర్డీఓ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, తమరి వద్ద ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోకుండానే వెళ్లి పోయిందని దళిత రైతులు వాపోయారు. ఆ తర్వాత దళితులందరూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ ఆఫీసుకు వెళ్లి వారి పేరు మీద ఉన్న పట్టా పాస్ పుస్తకాల జిరాక్స్ ప్రతులను ఇచ్చి వారి భూముల్లోంచి అక్రమంగా బాటi వేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఆర్డిఓ పట్టించుకోలేదన్నారు. మళ్లీ ఇప్పుడు ఆ వ్యక్తి గతంలో వేసిన పాతబాటను పునరుద్ధరించాలని ఆర్డీఓ నుంచి ఆర్డర్ కాపీ వచ్చిందని స్థానిక తహసిల్దార్, రైతులకు చెప్పగా..మా భూముల్లోంచి అక్రమంగా బండ్లబాట వేసేందుకు కుట్రలు చేస్తున్న వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ను కలిసి మొరపెట్టుకున్నట్లు తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో ఇనిగాల చంద్రయ్య, శనిగరపు రమేష్, శనిగరపు సదయ్య, ఇనిగాల స్వామి, గొర్రె అశోక్, ఇనిగాల రాజు దళిత రైతులున్నారు