మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్ మండలం,బిజ్వారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక వడ్డెర రాజేశ్వరి గత నెల 24వ తేదీన ఆత్మహత్య చేసుకుని చనిపొగ ఆ బాలిక ఆత్మహత్యకు కారణమైన ప్రధాన నిందితుడు బండ్ల రాజశేఖర్ రెడ్డిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు… ఈ సందర్భంగా గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెలలో మైనర్ బాలిక రాజేశ్వరి ఆత్మహత్యకు కారణమైన ప్రధాన నిందితుడైన రాజశేఖర్ రెడ్డిని కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో అరెస్ట్ చేసినట్లు మీడియాకు తెలిపారు.. అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు..