
మొగులపల్లి నేటి ధాత్రి
ఆత్మీయ మిత్రులు..కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మల్సాని బాపూరావు, మల్సాని రాజేశ్వర్ రావుల తల్లి మల్సాని ప్రమీలమ్మ సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించింది. కాగా తన అనుచరుల ద్వారా విషయం తెలుసుకున్న చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ మల్సాని ప్రమీలమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి..పూలమాలలు వేసి ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి..ఓదార్చారు. అనంతరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, స్వర్గలోక ప్రాప్తిరస్తు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్, మొగుళ్ళపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్, ఆకినపల్లి మాజీ ఎంపీటీసీ రెంటాల రాజేశ్వరీ-సంపత్, కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్, చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఓనపాకల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.