Bandi Sanjay’s “Modi Gift” Cycle Distribution at Malyala School
మల్యాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బండి సంజయ్ “మోడీ కాను”‘ కార్యక్రమం.
పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ.
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ మోడీ కానుక ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం బిజెపి వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ వికాస్ రావు చేతుల మీదుగా. ఈరోజు మన మల్యాల గ్రామంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వినయ్ కుమార్, జడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్చంద్ర మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు మరియు పిల్లలు, నాయకులు అల్లాడి రమేష్, మార్త సత్తయ్య, మొకిలి విజేందర్, సిరికొండ శ్రీనివాస్, చిర్రం తిరుపతి, రుద్రంగి ఏఎంసి డైరెక్టర్ ఈసరి శ్రీనివాస్, స్వామి వివేకానంద సేవ సమితి సభ్యులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మల్యాల గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్ రావు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ పదవ తరగతి విద్యార్థుల గురించి ఆలోచించి వారికి ప్రొద్దున మరియు సాయంత్రం స్పెషల్ క్లాసులు స్టడీ అవర్స్ ఉంటాయి కాబట్టి వారికి ఇంటి నుంచి రావడం మరియు ఇంటికి వెళ్లడం అనేది ఇబ్బందితో కూడుకున్నదని చాలా దూరం నుంచి వచ్చే విద్యార్థులకు సకాలంలో స్కూలుకు రావడానికి మరియు ఇంటికి వెళ్లడానికి ఎంతగానో సైకిల్ లు ఉపయోగపడతాయని తెలియజేశారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాటిసంజయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు.
