బేషరతుగా బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి

బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు

బోయినిపల్లి, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీద అనుచిత వాక్యాలు చేసిన ఎంపీ బండి సంజయ్ మీద మంగళవారం రోజున బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోయినిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్బంగా బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి మరియు బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్ మాట్లాడుతూ: దేవుడు పేరు చెబుతూ రాజకీయ పబ్బాం గడిపే నువ్వెక్కడ, ప్రజల కోసం పోరాటం చేస్తు ప్రజా సమస్యల కోసం పాటుపడే వ్యక్తి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఎక్కడ.బోయినిపల్లి పోలీస్ స్టేషన్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై పిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు,
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని,ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఉద్యమ కారుడు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అని అన్నారు.దేవుడు పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపూడు తప్ప ఏం చేసినావు నువ్వు,కరీంనగర్ కు ఏం అభివృధ్ది చేసావో చెప్పాలని,ఎంపీ బండి సంజయ్ నీ తప్పును ఒప్పుకొని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు క్షమాపన చెప్పాలని అన్నారు.ప్రజా సమస్యలను పట్టించుకోలేదు,గ్రామాల అభివృధ్ది లేదు,దేవుని పేరు చెప్పి రాజకీయం చేశుడు తప్ప,ఏం తెలుసు నీకు అని అన్నారు.రాబోయే కాలంలో ప్రజలు ఎంపీ బండి సంజయ్ కి బుద్ది చెబుతారన్నారు.60 యేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృధ్ది జరిగింది.అదే అభివృధ్ది పలాలను ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు.ప్రభుత్వ ఆస్తులను అమ్ముకొని దోచుకు తిన్నది మీ బీజేపి ప్రభుత్వం అని,రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు నీకు తప్పకుండా బుద్ధి చెబుతారు.ఎన్ని తప్పుడు పనులు చేసి ఎన్ని కోట్లు సంపాదించినవో అందరికీ తెలుసని,
మరోసారి రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కూసరవీందర్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఏనుగుల కనకయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు అనుముల హరికృష్ణ,మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్,బాలగోని బోయిని ఎల్లేష్,పిట్టల మోహన్, కత్తెరపాక శ్రీనివాస్,మమ్మద్ హుస్సేన్,గుడి శేఖర్ రెడ్డి,ఎండి బాబు,నజీర్,కైలాసం, మూదం శ్రీనివాస్,అమ్మిగల్ల గోపాల్, జలంధర్,నక్క శ్రీకాంత్,జాగిరి వెంకటేష్ కర్ణాకర్,నల్లగొండ శ్రీనివాస్, అనుముల హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!