కేసీఆర్ కు బండి సంజయ్ భేషరతుగా క్షమాపణలు చెప్పాలి
బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అనుచిత వాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో బండి సంజయ్ మీద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు విడుదల చేయించడంలో ధైర్యం చేయని బండి సంజయ్ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పట్ల ఇష్టానుసారంగా మాట్లాడటం అవివేకమని అన్నారు. కేంద్రంలో మంత్రి పదవి చేపట్టిన ఆయన రాష్ట్రానికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధికి సహకరించాల్సిందిపోయి.. అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మరోసారి నోరు జారితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జాడి శ్రీనివాస్,రామిడి కుమార్,గడ్డం రాజు,టైలర్ రాజు, జక్కనబోయిన కుమార్, స్వరూప మాజి కౌన్సిలర్ల పోగుల మల్లయ్య,రేవేల్లి ఓదెలు, జిలకర మహేష్,పారుపెల్లి తిరుపతి,యువ నాయకులు ఆర్నే సతీష్,కొండ కుమార్, లక్ష్మీ కాంత్, ఆశనవేణి సత్యనారాయణ,చంద్రకిరన్, సాయి కృష్ణ,దినేష్,క్రాంతి, నస్పూరి శివ,గోనే రాజేందర్, బుధగడ్డ రమేష్,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.