
Bandi Sanjay Kumar’s Birthday Celebrated
ఘనంగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు
మహాదేవపూర్ఆగస్టు21నేటి ధాత్రి *
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మహాదేవపూర్ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా మహాదేవపూర్ బస్టాండ్ లో వివేకానంద విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి, బాణాసంచా కాల్చి, స్వీట్స్ పంపిణి చేశారు, అనంతరం మహాదేవపూర్ మండల తాసిల్దార్ ఎరాబటి రామారావు మరియు హాస్పిటల్ సూపరెండెంట్ డా, విద్యావతి ముఖ్య అతిధిగా పాల్గొని,ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణి చేసి ఆసుపత్రి ప్రాంగణం లో చెట్లు నాటడం జరిగింది అలాగే బీజేపీ సీనియర్ నాయకులు కన్నీబోయిన అయిలన్న సహకారంతో ప్రధానోపాధ్యాయురాలు సరిత ఉపాధ్యాయుడు మడుక మధు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని 10వ 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు భగవద్గిత పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది,
బీజేపీ మహాదేవపూర్ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ఒక సామాన్య కార్యకర్త నుండి జాతీయ స్థాయి నాయకునిగా మరియు కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు, అనేక రకాల ప్రజా ఉద్యమాలు చేసి కింది స్థాయి నుండి వచ్చిన నాయకుడు అని అన్నారు, అలాగే కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రివర్యులుగా ఎదిగిన అయన జీవితం, నేటి కార్యకర్తలకు, యువకులకు ఆదర్శమన్నారు, కష్టపడి పనిచేసే నిజాయితీ కలిగిన కార్యకర్తలకు కేవలం భారతీయ జనతా పార్టీలోనే గుర్తింపు ఉంటుందన్నారు, రాబోవు రోజుల్లో బండి సంజయ్ఆ అమ్మవారి ఆసిస్సులతో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశభావం వ్యక్తం చేసారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ మండల ప్రధాన కార్యదర్శులు బొల్లం కిషన్, సూరం మహేష్, సీనియర్ నాయకులు కన్నీబోయిన అయిలన్న, సాగర్ల రవి, లింగంపల్లి వంశీ, బాలిరెడ్డి,శ్రీనివాస్,శ్యామ్,రాంరెడ్డి, వెంకటేష్, శ్రవణ్,సాయి, సంపత్, రాకేష్, మనోజ్, రాజు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు