Bandi Sanjay Kumar Releases Cyber Crime Awareness Poster
“సరైన అవగాహనే సైబర్ క్రైమ్స్ కు నివారణ” అనే పోస్టర్ను ఆవిష్కరించిన బండి సంజయ్ కుమార్
కరీంనగర్, నేటిధాత్రి:
తెలుగు రాష్ట్రాలలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సరైన అవగాహనే సైబర్ క్రైమ్స్ కు నివారణ అనే పోస్టర్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈకార్యక్రమం సైబర్ సత్యాగ్రహ తెలుగు రాష్ట్రాల కన్వీనర్, యువజన అవార్డు గ్రహీత గజ్జెల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్న పొరపాటే పెద్ద నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామానికి, ప్రతి పాఠశాలకు చేరాలన్నారు. అనంతరం గజ్జెల అశోక్ మాట్లాడుతూ “సైబర్ నేరాల నుండి రక్షణకు సామాన్య ప్రజలలో అవగాహనే ప్రధాన ఆయుధం యువత, మహిళలు, ఉద్యోగస్తులు ఇలా అందరికీ ఇది అవసరం. అందుకే ఈపోస్టర్ రూపంలో ప్రామాణికమైన సమాచారాన్ని పోతిరెడ్డి మాధవ రెడ్డి, సైబర్ వారియర్ సహకారంతో అందించేందుకు ముందుకువచ్చాం అని తెలిపారు. ఈకార్యక్రమంలో బిజేవైఎం జిల్లా కార్యదర్శి వేముండ్ల కుమార్, జేరిపోతుల పోచయ్య, జేరిపోతుల నర్సయ్య, జేరిపోతుల మహేష్, గజ్జెల నవీన్ కుమార్, అజయ్ జేరిపోతుల, వెంకటేష్ జేరిపోతుల, సతీష్ జేరిపోతుల, చందు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
