· రేవంత్‌ను ఢీకొట్టే సత్తా ఒక్క బండి సంజయ్‌కి మాత్రమే సొంతం
· ఆయన నాయకత్వం వుంటే రెట్టింపు వార్డుల్లో విజయం సాధ్యమయ్యేది!

· ప్రత్యర్థికి బలం వున్న ప్రాంతాల్లో కూడా ఓట్లు రాబట్టే సామర్థ్యం
· హిందూత్వను బలంగా ముందుకు తీసుకెళ్లగలిగిన నేత
· అంతర్గత విభేదాలున్నా పార్టీని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం
· కాంగ్రెస్ వైఫల్యాలను గట్టిగా నిలదీసిన నేత
· ప్రత్యర్థులు కూడా ఆయన సామర్థ్యాన్ని అంగీకరించ తప్పదు
· కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని మలచే చాతుర్యం
· రేవంత్ దూకుడుకు సరైన సమాధానం బండి సంజయ్
· కాంగ్రెస్ స్పీడును నిరోధించగల దిట్ట
· రాష్ట్ర బీజేపీకి దిక్సూచి కాగల సమర్థత బండి సంజయ్ సొంతం
హైదరాబాద్, నేటిధాత్రి:
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఫైర్‌బ్రాండ్ నాయకుడెవరని ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వచ్చే సమాధానం బండిసంజయ్ అని! ప్రత్యర్థులపై సంచలనాత్మక ఆరోపణలతో గుక్కతిప్పుకోనియకుండా చేసే సామర్థ్యం ఆయన సొంతం. ప్రత్యర్థులు బలంగా వున్న ప్రాంతాల్లోకి చొచ్చుకొని పోయి మరీ ఓటర్లను తనవైపు తిప్పుకోగలిగే సమర్థ నాయకుడు. ప్రస్తుత కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లోఏఐఎంఐఎంకు గట్టి పట్టున్న ప్రాంతంగా పేరుపొందిన కాశ్మీర్గడ్డను బీజేపీ ఖాతాలో వేసిన ఘనత బండి సంజయ్‌దే! ఆరఎసఎస్/బీజేపీ కార్యకర్తగా తన కెరీర్‌ను ప్రారంభించిన బండి సంజయ్ మూడుసార్లు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ముఖ్యంగా ఆరఎస్/బీజేపీ నేపథ్యం కార్యకర్తల సమీకరణతో పాటు బీఆరఎస్, కాంగ్రెస్ పార్టీలను దీటుగా ఎదుర్కొని మట్టి కరిపించే రీతిలో వారిని ముందుకు నడిపించిన ఘనత బండి సంజయ్‌కే దక్కుతుంది. కరీంనగర్ కార్పొరేషన్లో 66 స్థానాల్లో 30 స్థానాలు బీజేపీ కైవసమయ్యాయంటే అది బండిసంజయ్ ఘనతనే. అంతేకాదు ఇండిపెండెంట్ల సహాయంతో మెజారిటీ సాధించి కరీంనగర్ కా ర్పొరేషన్ పై మొట్టమొదటిసారి కాషాయ జెండాను ఎగురవేయించిన నాయకత్వ పటిమ కూడా బండి సంజయ్‌దే! కరీంనగర్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఇప్పటివరకు రూ.1500 కోట్లు ఖర్చు చేసిందని, బీజేపీని గెలిపిస్తే కార్పొరేషన్‌కు మరో రూ.500 కోట్లు తె ప్పించే బాధ్యత తనదంటూ దూకుడుగా, ఆత్మవిశ్వాసంతో ఆయన చేసిన ప్రసంగాలు ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్లాయి. ఇతర పార్టీల నాయకులు ఇంత ధైర్యంగా హామీలు ఇచ్చినట్టు మనకు కనిపించదు.
నిజానికి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వున్నప్పుడు, అంతకుముందు 7%గా వున్న పార్టీ ఓటు షేర్‌ను ఏకంగా 33%కు పెంచగలగడం ఆయనలోని నాయకత్వ పటిమకు నిదర్శ నం. సరిగ్గా ఇదేమాదిరి తమిళనాడులో అన్నామలై తన వాగ్ధాటి ప్రసంగాలతో బీజేపీ ఓటుషేరును గణనీయంగా పెంచగలిగారు. దూకుడు, నాయకత్వ లక్షణాల్లో ఈ ఇద్దరు నేతల్లో సారూప్యతకనిపిస్తుంది. కాగా కరీంనగర్ కార్పొరేషన్లో సాధించిన విజయం తెచ్చిన ఉత్సాహంతో ఆయనఈసారి జీహెచఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా కాషాయ ప్రభంజనాన్ని సష్టిస్తామని ప్రక టించడ ద్వారా బీజేపీ క్యాడర్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం జీహెచఎంసీని, మూడు కార్పొరేషన్లుగా అంటే…హైదరాబాద్, సైబరాబాద్ (శేర్లింగంపల్లి), మల్కాజ్గిరిలుగా విడగొట్టిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. బండి సంజయ్ నాయకత్వశైలి మిగిలిన నాయకులకు భిన్నం. ప్రజలను ఆకట్టుకునే స్థాయి దూకుడు ప్రసంగాలు, మొదటినుంచి పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ప్రధానంగా అనుసరించే వ్యూహం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు 80% టిక్కెట్లు ఎప్పటినుంచో పార్టీలో పనిచేస్తున్నవారి కే దక్కడానికి ప్రధాన కారణం బండి సంజయ్ చొరవే! ఈసారి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో “బండి” పూర్తిగా భిన్నమైన రీతిలో ప్రచారం నిర్వహించారు. నగరాలకు, పట్టణాలకు కేంద్రం అందిస్తున్న నిధుల వివరాలు, ప్రధాని మోదీ అజెండాను బాగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ముఖ్యంగా తనదైన శైలిలో వారికి అర్థమయ్యేలా చేప్పడంలో ఆయన సాధించిన విజయం పార్టీని రెండు కార్పొరేష్లలో మొదటిసారి అతిపెద్ద పార్టీగా అవతరించేలా చేసింది.
పట్టణ స్థానిక ఎన్నికల్లో సత్తా చూపినప్పటికీ, కాంగ్రెస్ (52% వార్డులు), బీఆరఎస్ (27% వా ర్డులు)ల తర్వాత మూడోస్థానికే (10.1% వార్డులు) పరిమితం కావడం పార్టీ బలోపేతం కావడానికి ఇంకా చాలాదూరం ప్రయాణించాలన్నది స్పష్టమవుతోంది. బండి సంజయ్ తర్వాత రాష్ట్రానికి పార్టీ అధ్యక్షులుగా జి. కిషన్‌రెడ్డి వ్యవహరించగా ప్రస్తుతం ఎన్. రామచంద్రరావు కొనసాగు తున్నారు. నిజానికి బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పిండం అధిష్టానం చేసిన చారిత్రక తప్పిదంగా పరిగణిస్తున్నారు. ఆయన దూకుడు శైలి పార్టీని ఒకరకంగా పరుగులు పెట్టించిందనే చెప్పాలి. ఇప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో పార్టీని గతంలో కంటే మెరుగైన స్థితిలో నిలిపారనడానికి కరీంనగర్, నిజామాబాద్‌ల్లో సాధించిన విజయాలే ఉదాహరణ. ఆయన మార్గదర్శకత్వంలో ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు పనిచేయ డంతో కరీంనగర్లో మొట్టమొదటిసారి 30 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు గెలుపు సాధించారు. ప్రస్తుతం కేంద్ర ీVAంశాఖ సహాయమంత్రిగా వున్న ఆయన రాష్ట్ర అధ్యక్షపదవికోసం తాను రేస్‌లో లేనని, కేంద్రమంత్రి విధుల్లో కొనసాగుతానని స్పష్టం చేయడం గమనార్హం. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా వున్నట్లయితే, పార్టీ పరిస్థితి మరోలా వుండేదన్న భావన అంతర్గతంగా చాలామంది నాయకుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇదిలావుండగా పార్టీలో ప్రస్తుతం పాత కాలంనుంచి పనిచేస్తున్నవారు, కొత్తగా పార్టీలో చేరిన నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బండి సంజయ్, ఈటెల రాజేందర్ లమధ్య ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి! 2025లో జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికలకోసం పార్టీ సన్నద్ధమయ్యే ప్రక్రియ సందర్భంగా మళ్లీ వీరిద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా వున్నప్పుడు కూడా వీరి సఖ్యత ఉప్పు`నిప్పు మాదిరిగా వుండేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తే వీరిద్దరి మధ్య విభేదాలు మరింత తీవ్రమై, పార్టీకి నష్టం కలుగుతుందని చేస్తున్న కొందరి వాదనలో నిజం లేకపోలేదు! అప్పట్లో బీజేపీలో వున్న సినీతార విజయశాంతి ఒక సందర్భంలో మాట్లాడుతూబీఆరఎస్తో కుదిరిన రహస్య ఒప్పందం మేరకే బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవిని తప్పించారని ఆరోపించడం అప్పట్లో సంచలనం సష్టించింది. అధికార బీఆరఎస్‌కు ఇబ్బందికరంగా మారినందుకే ఈ పనిచేశారన్నది ఆమె మాటల్లోని అంతరార్థమని భావించాలి. ఈ పరిణామాలను చక్కదిద్దేందుకే అధిష్టానం పార్టీ స్థిరీకరణ ప్రక్రియలో భాగంగా ఎన్. రామచంద్రరావుకు అ ధ్యక్షస్థానం కట్టబెట్టింది. ఎందుకంటే ఆయన పార్టీలో అజాత శత్రువు మాత్రమే కాదు, ఆరఎసఎస్‌తో బలమైన సంబంధాలున్న నేత!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు వ్యవహారశైలిని అడ్డుకోవాలంటే ఫైర్ బ్రాండ్ బండి సంజ య్ మాత్రమే సరైన నాయకుడన్న అభిప్రాయం వుంది. 2020 జీహెచఎంసీ ఎన్నికలు (48 స్థానాల్లో గెలుపు), తాజా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (30 డివిజన్లు) విజయసాధన కేవలం బండి సంజయ్ కీలకంగా వ్యవహరించడంవల్లనే సాధ్యమైందని ఈ ప్రాంతాలకు చెందిన పార్టీ కేడర్‌లో స్పష్టమైన అభిప్రాయముంది. గతంలో “ప్రజా సంగ్రామ యాత్ర” పేరుతో బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్ర అప్పటి బీఆరఎస్ ప్రభుత్వాన్ని కుదిపేసిందని, ఇప్పుడుకాంగ్రెస్ను దెబ్బతీయాలంటే అటువంటి యాత్ర అవసరమని పార్టీ క్యాడర్ భావిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన్ను పదవినుంచి తప్పించడంలో ఒక్కసారిగా చల్లారిన ఊపు, మళ్లీ ఈ ప్రజాసంగ్రామ యాత్రతో వచ్చిందని స్థానిక నాయకుల్లో స్పష్టమైన అభిప్రాయం. అం దుకు అన్ని విధాలా సమర్థుడు బండి సంజయ్ మాత్రమేనన్నది వారిలో వ్యక్తమవుతున్న ఏకాభి ప్రాయం. ఇదిలావుండగా పార్టీ అధిష్టానం ప్రస్తుతం బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవితో పాటు, నేషనల్ జనరల్ సెక్రటరీగా కూడా కొనసాగిస్తూ రాష్ట్ర రాజకీయాలపై ఆయన ప్రభావం కొనసాగేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఆయన హైకమాండ్ ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాల్సిన విషయం మరోటుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే పార్టీ 14% అధికంగా ఓట్లు సంపాదించినా కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లోనే గెలవగలిగింది. అదే వీధి పోరాటాలు సమర్థవంతంగా చేయగల బండి సంజయ్ ఉన్నట్లయితే పార్టీ ఎదుగుదల మరో తీరులో వుండేదని వివిధ స్థాయిల్లోని నాయకుల విస్పష్ట అభిప్రాయం.
అధిష్టానం కూడా బండి సంజయ్‌ను తొలగించడంలో ఒక కారణముంది. అప్పట్లో బండి వర్సెసఈటెల వర్సెస్ ధర్మపురి అరవింద్ క్యాంపుల మధ్య కలహాల కాపురం కొనసాగుతున్న నేపథ్యం లో ఈ పోరాటాన్ని తటస్థీకరించే ప్రక్రియలో భాగంగా జి.కిషన్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర పగ్గాలను అప్పగించింది. ఇందుకూ ఒక కారణముంది. “ప్రస్తుత పరిస్థితుల్లో బండి సంజయ్ వంటి దూకుడు కలిగిన నాయకుడివల్ల పార్టీ నష్టపోతున్నది. ఎందుకంటే ఆయన దూకుడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఉదారవాద నాయకుడిని మాత్రమే అంగీకరిస్తారు” అంటూ కొందరు నాయ కులు హైకమాండ్‌కు నూరిపోయడం కూడా కిషన్‌రెడ్డి నియామకానికి కారణమని చెబుతారు. ఈ తప్పుడు నివేదనతో కేంద్ర నాయకత్వం తక్షణమే స్పందించి, బండి సంజయ్‌ను అధ్యక్ష పదవినుంచి తప్పించినా, ఆయన నాయకత్వ విలువ తెలుసు కనుక నేషనల్ జనరల్ సెక్రటరీగా ప్రమోట్ చేసి, సహాయ మంత్రి పదవిని కట్టబెట్టింది.
2018 నుంచి గమనిస్తే రాష్ట్రంలో బీజేపీ ఒక క్రమానుగత వద్ధిని నమోదు చేస్తూ రావడం గమనార్హం. ఉదాహరణకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓట్‌షేర్ 7.1% వుండగా 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి దాదాపు రెట్టింపు అంటే 13.9%కు పెరగడం గమనార్హం. ఇదే సమయంలో అసెంబ్లీలో ఒక్క స్థానం నుంచి ఏకంగా ఎనిమిది సీట్లకు ఎగబాకింది. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లో 8 సీట్లను గెలుచుకుంది. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల ఓట్‌షేర్ 19.5% వుండగా 2024 నాటికి దాదాపు రెట్టింపు 35.1%కు పెరిగింది. రెండు ఎన్నికల మధ్య ఇంతటి పురోగతిని కనబరచిన పార్టీ 2026 స్థానిక ఎన్నికల్లో కేవలం 14% ఓట్లను సాధించి దారుణ పనితీరును ప్రదర్శించింది. అంటే గత లోక్‌సభ ఎన్నిక లతో పోలిస్తే 21% ఓట్లను కోల్పోయింది. 2020 స్థానిక ఎన్నికల్లో సుమారు 13% ఓట్లతో 330 వార్డుల్లో గెలుపొందిన పార్టీ ప్రస్తుతం14% ఓట్లతో 336 వార్డుల్లో గెలవడం గమనార్హం. అంటే 2024 నాటి ఎదుగుదల కొనసాగివున్నట్లయితే ఈ ఎన్నికల్లో ఇంతకు రెట్టింపునకు పైగా వార్డులు గెలుచుకొని వుండేదన్నది అక్షరసత్యం. బండి సంజయ్ దూకుడు వున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేదనేది కూడా పై విశ్లేషణను బట్టి చూస్తే అర్థమవుతుంది.
రేవంత్ దూకుడుకు కౌంటర్‌గా బండి సంజయ్ వ్యవహరించగలిగేవారని ఫలితంగా ఈ మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పాలనకు ఒక రెఫరెండంగా మార్చేసి, 70 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయాన్ని సమర్థవంతంగా నిరోధించగలిగేవారన్నది పార్టీలో అంతర్గతంగా వ్యక్తమవుతున్న అభి ప్రాయం. అంతేకాదు బండి సంజయ్ కాంగ్రెస్ పలుకుబడిని బాగా తగ్గించగలిగేవారన్నది ఒక విశ్లేషణ. ఇక్కడ ఆయనకు ప్రతికూలతలు కూడా వున్నాయన్నది మరో వర్గం వాదన. ముఖ్యంగాఈటెల రాజేందర్ వర్గం తమకు పలుకుబడి వున్న ప్రాంతాల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి,బండి సంజయ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించడం ద్వారా ఆత్మహత్యా సదశ రాజకీయాలకు కారణమయ్యేది. ఇక రెండవది బండి సంజయ్ దూకుడుగా హిందూత్వను ముందుకు తీసుకెళుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆరఎస్, ఏఐఎంఐఎంలు ఏకమై బీజేపీని ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేసేవన్నది ఈ వర్గం వాదన. ఈవిధంగా హిందూత్వను ముందుకు తీసుకెళితే, మతతత్వాన్ని ప్రోత్సహించినట్లవుతుందని పార్టీలో అంతర్గతంగా ఈటెల రాజేందర్ వంటి నాయకులు, వాదిస్తున్నారు కూడా! ఈ రెండు వాదనల్లో దేని బలం దానిదే, దేని బలహీనత దానిదే. కానీ అందరూ ఒక్క విషయంలో మాత్రం ఏమాత్రం విభేదించరు. అదే రేవంత్ రెడ్డి అనుసరిస్తు న్న వీధిపోరాట శైలికి బండి సంజయ్ శైలి ఎంతమాత్రం తీసిపోదు. తెలంగాణ అభివద్ధి, కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపు విషయంలో ఆయన ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నేరుగా ఛాలెంజ్ చేయడం విపక్ష నేతల్లో ఆయన్ను ముందు నిలిపింది. తనను తాను బీసీ నేతగా చెప్పు కోవడమే కాదు, దమ్ముంటే బీసీ నేతలను ముందుకు తీసుకురావాలని కాంగ్రెస్, బీఆరఎస్‌ల కు నేరుగా సవాలు చేసిన ఘనత కూడా ఆయనదే! బీజేపీ గెలిస్తే బీసీ నాయకుడిని (57% బీసీలు)ముఖ్యమంత్రిని చేస్తుందని ప్రకటించి కాంగ్రెస్, బీఆరఎస్‌లను ఇరుకున పెట్టారు. ఈ అంశాల ను పరిశీలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌ను ఢీ అంటే ఢీ అని ఎదురు నిలవాలంటే బండి సంజయ్‌కి మాత్రమే సాధ్యమన్న అభిప్రాయం మెజారిటీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి కే ఆయన ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలను పార్టీకి పవర్ హౌజ్‌లుగా మార్చేశారు. దక్షిణ, గ్రామీణ తెలంగాణలో పార్టీ ఇంకా బలహీనంగా వుంది. ఈ ప్రాంతాల్లోని 43 మున్సిపాలిటీల్లో పార్టీ ఇంకా ఖాతా తెరవలేదు. ఈ ప్రాంతాల్లో బీఆరఎస్ ఓట్ షేర్ 28.7%. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పడిన చాలా ఓట్లు ఇప్పుడు బీఆరఎస్ ఖాతాలో పడటమే ఈ పుంజుకోవడానికి కారణం! ఇప్పుడు బండిసంజయ్ నాయకత్వంలో బీజేపీపట్టణ కార్పొరేషన్లలో చాలా వరకు బీఆరఎస్‌ను వెనక్కి నెట్టేసి రెండోస్థానానికి చేరుకుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాల్లో ఇంకా బీఆరఎస్ తన బలాన్ని కొనసాగిస్తూ రెండో స్థానంలో వుండటం గమనార్హం. ఈ గ్యాప్‌ను పూడ్చే సామర్థ్యం కేవలం బండి సంజయ్‌కు మాత్రమే వున్నదనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
