# ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏబిఎస్ఎఫ్ పిడిఎస్యు సంఘాల ఆధ్వర్యంలో బంద్.
నర్సంపేట,నేటిధాత్రి :
దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజి పట్ల ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో
ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏబిఎస్ఎఫ్ పిడిఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ నర్సంపేట డివిజన్ విజయవంతం అయ్యింది.పలు పాఠశాలలు,కళాశాలల్లో బంద్ కు సహకరించాలని ఆయా విద్యార్థి సంఘాల నాయకులు కోరగా ప్రభుత్వ,ప్రైవేట్ యాజమాన్యాలు స్వచ్చందంగా సహకరించారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థసారథి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్, ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ పిడిఎస్యు జిల్లా కార్యదర్శి గురం అజయ్ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ ను రద్దు చేయాలని అసమర్థ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతూ, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నప్పటికీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇటీవల నెట్ నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిహెచ్ డి అడ్మిషన్ కోసం ఇటీవల ఆమోదించిన నైట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని టీఐఎస్ఎస్ ముంబై ఐఐటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి నాయకులపై అక్రమ కేసుల్లో నిర్బంధాలు, యూనివర్సిటీలో స్వేచ్ఛ వ్యక్తీకరణ ప్రజా అణిచివేత విధానాలు మానుకోవాలని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలల్లో ఏఐఎస్ఎఫ్ నాయకులు స్టాలిన్, పాలక పవన్, తరుణ్ , ఎస్ఎఫ్ఐ నాయకులు గొర్రె చందు, ఎస్ కిరణ్, ఏబిఎస్ఎఫ్ నాయకులు ప్రశాంత్, వినోద్, శ్రీకాంత్, పిడిఎస్యు నాయకులు రవీందర్, కృష్ణకర్, విష్ణు, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.