“బంధన్ హాస్పిటల్” కు రాజకీయ నేతల అండదండలు!?

అందుకే ఆసుపత్రిలో నిర్లక్ష్యం జరిగినా చర్యలు తీసుకోవట్లేదు

బాధితుడు జర్నలిస్టు కృష్ణ ఆరోపణ

నెటిదాత్రి, వరంగల్

హనుమకొండ లోని బంధన్ ఆసుపత్రిలో తనకు జరిగిన అన్యాయంపై అధికారులకు ఫిర్యాదు చేయగా చర్యలకు భయపడుతున్నారని బాధితుడు జర్నలిస్టు కృష్ణ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యుడు ఆపరేషన్ సమయంలో, పోస్ట్ ఆఫ్ కేర్ లో చేసిన నిర్లక్ష్యం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి చేరుకొని, నెలల పాటు మంచానికే పరిమితమయ్యానని వివరించారు. తనకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పట్ల బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బంధన్ ఆసుపత్రిలో జరిగిన తప్పిదానికి వైద్యులను బాధ్యులను చేస్తూ.. తనకు న్యాయం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!