యాదవ హక్కుల పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ జక్కుల శ్రీనివాసరావు యాదవ్
హన్మకొండ, నేటిధాత్రి:
జక్కుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కి మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని అదేవిధంగా ప్రజల మద్దతు ఉండటం వల్ల భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని మహబూబాబాద్ పార్లమెంటు నుంచి బలరాం నాయక్ కి అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారనీ సోమవారం విలేకరుల సమావేశంలో బలరాం నాయక్ అన్నారని శ్రీనివాస్ అన్నారు.గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో ఆదివాసి గిరిజన బహుజన, మైనారిటీ మహిళ విద్యార్థి లోకం పూర్తిస్థాయిలో మద్దతునిచ్చి లక్షల మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా ఆరోజు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు సాధించుటకై బలరాం నాయక్ చూపిన సాహసం ఎంతో గొప్పదని తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో సాదాసీదా జీవితం గడిపి వెనుకబడిన మహబూబాబాద్ పార్లమెంట్ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధిష్టానము బలరాం నాయక్ విధేయతను ప్రజల పట్ల తనకున్న విశ్వాసమును గుర్తించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం నాయక్ కి మహబూబాబాద్ ఎంపీ సీటు ఖరారు చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని జక్కుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు.