తక్షణమే బాల్క సుమన్ పై కేసు నమోదు చేయాలి.
వీణవంక,(కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి: కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వాక్యాల నిరసనగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సునీల్ ఆధ్వర్యంలో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సుమన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైన కావని ఇలాంటి వాక్యాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత మతిభ్రమించి మాట్లాడడం బీ ఆర్ఎస్ నాయకులకు అలవాటైపోయిందని దళిత సామాజిక ముసుగులో నువ్వు ఏది మాట్లాడితే అది నిజమని అనుకునేవారు లేరని ఇలాంటి వాక్యాలు మళ్లీ పునరావతమైతే నిన్ను బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని అన్నారు.ఈ కార్యక్రమంలో నల్ల కొండారెడ్డి, ఎండీ సాహెబ్ హుస్సేన్, జున్ను తుల మధుకర్ రెడ్డి, సంధి సురేందర్ రెడ్డి, దాసారపు లక్ష్మణ్, పోరేడి తిరుపతిరెడ్డి, సమ్మిరెడ్డి, వీణవంక గ్రామ శాఖ అధ్యక్షుడు రజాక్, రంగన్న,పర్లపల్లి ప్రసాద్,కర్ర గోపాల్ రెడ్డి,మోహన్ రెడ్డి, ప్రభు దాస్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.