బాల్క సుమన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రేస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు

హన్మకొండ, నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌ. రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఉస్మానియా విద్యార్థి నాయకునిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే బాల్క సుమన్ ఎన్నికల్లో ఓటమికి గురై విచక్షణ కోల్పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బలంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధించిన గెలుపును టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం జీర్ణించుకోవడంలేదు.బడుగు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా,ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలను అమలు చేసే దిశగా ప్రజా దీవెనలతో ముందు సాగుతున్న ప్రభుత్వ పాలనను టిఆర్ఎస్ నాయకత్వంతో పాటు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోవడం లేదు సీఎం రేవంత్ రెడ్డి నీ ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే భేషరతుగా వెనక్కి తీసుకోవాలి లేనిచో బాల్క సుమన్ కు గుణపాఠం తప్పదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ చిల్లర నాయకుడు బాల్కసుమన్ దిష్టి బొమ్మను ఉమ్మడి వరంగల్ జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు ఆధ్వర్యంలో అదాలత్ జంక్షన్ లో బాల్క సుమన్ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వేముల రమేష్, కందుకూరి రజినీకాంత్, సిద్ధం యుగేందర్, అరుణ్ ప్రసాద్,మహేందర్, కునూరు రంజితకుమార్, ఆనందమోహన్, తోట రాజకుమార్, పోతారాజురవి, రమేష్ నాయక్, నల్ల మహాత్మా, విజయ్ భాస్కర్ రెడ్డి, నిఖిల్, శ్రీనాథ్, వినయ్, జగన్మోహనరెడ్డి, పోషిని రవీందర్, రావుల శ్రీనివాసరెడ్డి, పిల్లి కార్తీక్, అరుణ్, సుదర్శన్, మునిగాలా రవీందర్, అశోక్, అనిల్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!