
జెండర్ స్పెషలిస్ట్ హర్షిత రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
విద్యార్థులలో సృజనాత్మక పెంచేందుకే బాలసభలు ఎంతగానో ఉపయోగపడతాయని డైరెక్ట్ హబ్ ఆఫ్ ఎంఫఫర్ మెంట్ ఉమెన్ జెండర్ స్పెషలిస్ట్ హర్షిత రెడ్డి అన్నారు. నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో బేటి బచావో బేటి పడావో స్కీమ్ లో భాగంగా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గురిజాల జెడ్పిఎస్హెచ్ పాఠశాలలో బాలసభ, డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు చట్టాల గురించి మరియు హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి వివరించి పిల్లలకు అవగాహన కల్పించారు. బాలికలలో నైపుణ్యాలను పెంచేందుకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో గురిజాల సర్పంచ్ గోడిశాల మమత సదానందం గౌడ్, ఐసి డిఎస్ సూపర్వైజర్ పారిజాతం , గ్రామ వైద్యులు సహజ, ఆశ, మ్మ్, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.