# రాముని భక్తులమే.. కానీ రాముని ముసుగులో రాజకీయం చేస్తే తరిమికొడతాం..
# బిఆర్ఎస్ పార్టీ చెల్లని పైసా…?
# కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కల్లపల్లి రవీందర్ రావు .
నర్సంపేట,నేటిధాత్రి :
పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ రెండు లక్షల ఫైచిలుకు మెజార్టీతో గెలవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కల్లపల్లి రవీందర్ రావు దీమా వ్యక్తం చేశారు.శుక్రవారం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మానుకోట గడ్డపై నిర్వహించే జనజాగరణ సభకు నర్సంపేట నియోజకవర్గంలో దుగ్గొండి,నర్సంపేట రూరల్,టౌన్, చెన్నారావుపేట, నెక్కొండ,నల్లబెల్లి,ఖానాపురం మండలాల నుండి తరలి వెళుతున్న కాంగ్రెస్ శ్రేణుల బస్సులను జిల్లా అధికార ప్రతినిధి తక్కల్లపల్లి రవీందర్ రావు, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఓర్స్ తిరుపతి లు నర్సంపేట పట్టణంలో పార్టీజండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ భారీ మెజార్టీతో గెలువడం లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కుతున్నారని అన్నారు. తెలంగాణ గడ్డ పోరాటాల ఆడ్డ అనీ, రాష్ట్ర ప్రజలు ఎంతో చైతన్యవంతులని ఈ ప్రాంతంలో మతోన్మాదులకు తావు లేదని,రాముని భక్తులమే కానీ రాముని ముసుగులో రాజకీయం చేయాలని చూస్తే తరిమికొడతామని హెచ్చరించారు. తెలంగాణలో అవినీతితో రాజ్యమేలిన బిఆర్ఎస్ పార్టీ నేడు చెల్లని పైసాగా మిగిలిందని డిపాజిట్లు నిలుపుకునే ప్రయత్నంలో కెసిఆర్ తాపత్రయం పడుతున్నాడని ఆరోపించారు. ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ భారతదేశ సుపరిపాలనకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దండెం రతన్ కుమార్,ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు అఖిల్,కటారి ఉత్తమ్ కుమార్, ఓర్సు సాంబయ్య, వెంకన్న, సారంగం గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.