ఉఫాధి హమి ఫధకం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఉఫాధి హమి కూలీలకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో న్యాయ్
భద్రాచలం నేటి ధాత్రి
బలరాం నాయక్ ని ఎంపిగా గెలిపించే భాధ్యత మనం తీసుకుంటే,కేంద్ర మంత్రి గా తిరిగి పంపించే భాధ్యత సోనియమ్మ తీసుకుంటుంది
ఏజెన్సి గ్రామాలను అభివ్రృధ్ధి చేసిన ఘనత బలరాం నాయక్ ది
మాజీ గ్రంథాలయ చైర్మన్ బోగాల శ్రీనివాస్ రెడ్డి
మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుకుంటూ మాజీ గ్రంథాల చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి భద్రాచల నియోజకవర్గ కేంద్రమైన భద్రాచలం పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన పట్టణ ప్రజలతో మాట్లాడుతూ.
బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా ఉన్న టైం లోనే వెంకటాపురం, భద్రాచలం నూతన బ్రిడ్జిను తీసుకురావడం జరిగిందని.
భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును నేషనల్ హైవేగా పునరుద్ధరణ చేసి భద్రాచలం అభివృద్ధి చేసే బాధ్యత వలన తీసుకుంటారని,భద్రాచలం ప్రాంతం పై అమితమైన ప్రేమ,అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పం ఉన్న బలరాం నాయక్ గారిని మరొకసారి గెలిపించుకుని ఈ ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు దోహదపడాలని ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు.
ఈ ఎన్నికల ప్రచారంలో
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాసమల రాము, కాంగ్రెస్ నాయకులు దుద్దుకూరు సాయిబాబా, ఇందుల రమేష్, మహిళ కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి, కట్టా కళ్యాణి, పద్మప్రియ, రూపా దేవి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.