యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి
నెలరోజుల వ్యవధిలో కాలం చేసినా ఓకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు
కుమారులను పోగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి 5,000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసినా బాలెంల సైదులు గారు
అడ్డగూడూరు: మండల కేంద్రానికి చెందిన మనుపటి నరసింహా గారి కుమారులు మనుపటి యాదగిరి – మనుపటి సత్తయ్య గార్లు ఇరువురు అన్నదమ్ములు అనారోగ్య సమస్యలతో నెలరోజుల వ్యవధిలో మరణించడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో కుమారులను పోగొట్టుకున్న బాధలో ఉన్న నరసింహ గారికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బాలెంల సైదులు గారు భరోసా కల్పించి 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మనుపటి నరసింహా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తుప్పతి బీరప్ప మనుపటి బాలు,మానుపటి అంజయ్య, బాలెంల మల్లయ్య, పూజారి నాగరాజు, బురుగుల సురేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు మేకల పవన్ , బండ నరేందర్,ఉడుగు మల్లేశ్, షేక్ రెహమాన్, నారబోయిన లింగుస్వామి, బోయిపల్లి మధుగౌడ్, బాలెంల జీవన్, మహిళలు మనుపటి రమ్య,మంగమ్మ, అనితా, సాయమ్మ యాదమ్మ తదితరులు పాల్గొన్నారు
