నర్సంపేట టౌన్ , నేటిధాత్రి :
బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్, అక్షర ద స్కూల్ 4వ తరగతి విద్యార్థులు శనివారం ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా పట్టణంలోని
పోస్ట్ ఆఫీస్ ను సందర్శించారు.ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీసులో అధికారులు నిర్వహిస్తున్న విధులను విద్యార్థులు గమనిస్తు
వాటి వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి గౌడ్ మాట్లాడుతూ పోస్టాఫీసు భారతీయ తపాలా వ్యవస్థలో అతి ముఖ్యమైన
విభాగమని అన్నారు. ప్రజల ఉత్తర ప్రత్యుత్తరాలను (సమాచారాన్ని) మారుమూల గ్రామం నుండి
పట్టణాలకు అందజేయడంలో పోస్ట్మన్లు ప్రధాన పాత్ర పోషిస్తారని అన్నారు. పోస్టాఫీసు ప్రతి
గ్రామంలో అందుబాటులో ఉంటుందని వాటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ముఖ్యంగా లేఖలు, లేదా ఉత్తరాలు గమ్యస్థానానికి చేర్చి అందజేయుట, ఆర్ధిక లావా దేవిలు,
డబ్బు పంపే సేవలు, జీవిత భీమా, గ్రామీణ పోస్టల్ జీవిత భీమా, డబ్బు చెల్లింపు, పెన్షన్ వంటి
మొదలైన విధులను తపాలా కార్యాలయం నిర్వహిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో
అక్షర ద స్కూల్ ప్రిన్సిపాల్ జి. భవాని, సబ్ పోస్ట్ మాస్టర్ సురేష్,పోస్టల్ అసిస్టెంట్ రాజన్,
పోస్ట్ మ్యాన్లు అనూష, సంపత్, కిషోర్, నాగేందర్, సంపత్, పాఠశాల ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.