స్పెల్ బి రాష్ట్రస్థాయి పోటీల్లో బాలాజీ విద్యార్థి ప్రతిభ
నర్సంపేట,నేటిధాత్రి:
హైదరాబాద్లో ఈ నెల 29న నిర్వహించిన స్పెల్ బి రాష్ట్రస్థాయి పోటీల్లో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థిని చి. దాక్షిక ప్రతిభ కనబర్చి రైసింగ్ స్టార్ ట్రోఫీను గెలుచుకుంది.ఈ సందర్భంగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ ఏ. వనజ విద్యార్థినిని అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్. జ్యోతి, అక్షరధా స్కూల్ ప్రిన్సిపాల్ జి. భవాని, ఉపాధ్యాయులు జోసెఫ్, లక్ష్మీ, నవ్య తదితరులు పాల్గొన్నారు.
