Balaji School Tops Gurukul Results
గురుకుల ప్రవేశ ఫలితాల్లో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ జయకేతనం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలో గల బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు గురుకుల విద్యాలయ సమితి విడుదల చేసిన 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 10 సీట్లను సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు.ఈ ప్రవేశ పరీక్షలో లౌక్య, శ్రేయాన్స్, సాత్విక్, సహస్ర, అరుణ్, చంద్ర అఖిల్, శరణ్య, స్నిగ్ధ శ్రీ, హర్షిత, దీపక్ అర్హత సాధించారు. అనంతరం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య మన భవిష్యత్తుకు పునాది వంటిదని, మంచి పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించి తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. జ్యోతి విద్యార్థులకు పూల బొకేలు అందజేసి అభినందించారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను ప్రశంసించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
