
బాలాజీ ప్లవర్ అసోసియేషన్ కమిటీ నూతన కమిటీ ఎన్నిక
ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన కమిటీ
నర్సంపేట టౌన్,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని పూల దుకాణాల బాలాజీ ఫ్లవర్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా నూతన కమిటీ సభ్యులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.నూతన కమిటీ అధ్యక్షుడు పర్ష శ్రీనివాస్ ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శి బానోత్ పంతుల్ నాయక్,కార్యదర్శి కోల వెంకటే శ్వర్లు,కోశాధికారి భయ్యా కర్ణాకర్,కమిటీ సభ్యులు పర్ష వెంకన్న, పుల్లయ్య,శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.