ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట డివిజన్ పరిధిలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.నర్సంపేట పట్టణ, మండల ముస్లిం సోదరులు శనివారం ఉదయం మాదన్నపేట రోడ్డు ఈద్గాయందు పవిత్ర బక్రీద్ పండుగ నమాజును భక్తిశ్రద్ధలతో జామా మజీద్ ముష్టి మహబూబ్ చదివించారు. అనంతరం పండుగ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖ నాయకులు తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ ప్రార్ధనలో పాల్గొని మాట్లాడుతూ బక్రీద్ నెలలో హచ్ యాత్ర జరుగుతుందని, ఈ యాత్రకు ప్రపంచ నలీమూలల నుంచి ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తారని పేర్కొన్నారు. త్యాగాలకు ప్రతిరూపం బక్రీద్ అని ప్రతి ముస్లిం తనలో ఉన్న చెడు అలవాట్లను చెడు నిర్ణయాలను చెడు ప్రవర్తనను మానుకోవడమే కాకుండా కుర్బానీ సమాజ సేవ మంచితనం మానవత్వం త్యాగగుణం కలిగి ఉండడమే పండుగ ప్రాముఖ్యత జావిద్ అన్నారు. అనంతరం కులమతాలకతీతంగా సోదర భావం తెలుపుకుంటూ ప్రేమతో అలింగణం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.పట్టణంలో ఉన్న అబ్రస్తాన్ ముస్లిం స్మశానవాటికలకు వెళ్లి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి సమాధులపై పూలు పెట్టి ప్రార్థలను చేశారు.ఈ కార్యక్రమంలో జమా మజీద్ కమిటీ అధ్యక్షులు నబీ కార్యదర్శి హబీబ్ అయుబ్ మసూద్ అలీ హుస్సేన్, ఎస్ డి జావేద్,ఎండి రబ్బాని,ఎండి యూసుఫ్,ఎస్కే షరీఫ్,ఎస్ కే జాఫర్, ఎండి రజాక్,ఎండి మురుషోర్, ఎండి ఖలీల్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.